వంకాయ ఎందుకు తినాలి? ఎంతోమంది వంకాయను తినడానికి ఇష్టపడరు. కానీ వంకాయను కచ్చితంగా తినాలి. వంకాయ తినడం వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. అధికబరువు ఉన్న వారు వంకాయను కచ్చితంగా తినాలి. వంకాయ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఫోలేట్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటాయి. వంకాయను తినడం వల్ల గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి రాకుండా ఉంటాయి. మధుమేహం ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన కూర వంకాయ. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వంకాయను తినడం వల్ల మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.