రాత్రి నిద్ర పట్టేందుకు ఇబ్బంది పడుతుంటే మీరు తీసుకుంటున్న ఆహారం మీద ఒకసారి దృష్టి పెట్టడం అవసరం. మన ఆహారంలో ఉండే మిరపకాయలు, ఇతర మసాలాలు మన శరీర థర్మోగ్రూలేట్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. కారంగా ఉండే ఆహారంలో క్యాప్సైసిన్ అనే రసాయనం. ఇది శరీర ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచుతుంది. ఎక్కువ స్పైసీగా ఉండే ఆహారం తీసుకున్నపుడు నిద్రపట్టడానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. సోడియం ఎక్కువగా ఉన్న భోజనం వల్ల శరీరంలో నీరు చేరుతుంది. బీపీ కూడా పెరుగుతుంది. క్రిస్పిగా లేదా సాల్టెడ్ స్నాక్స్ ఏవీ తీసుకున్నా కూడా శరీరం త్వరగా విశ్రాంతి స్థితికి చేరుకోదు. ఫలితంగా నిద్ర పట్టదు. టెరమైన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో నోర్ ప్రైన్ ఉత్పత్తికి కారణమవుతుంది. ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ కి కారణమయ్యే హార్మోన్. టమాటలు, వంకాయలు, సోయాసాస్, రెడ్ వైన్ లలో టెరమైన్ ఎక్కువ. నిద్రపట్టని వారు ఇవి తీసుకోకూడదు. All Images Credit: Pexels