అరిటాకులో భోజనానికి ముందు చుట్టూ నీళ్లు ఎందుకు చల్లుతారు? అరిటాకులో అన్నం తినడం ఆరోగ్యానికి చాలామంచిదని మన పూర్వికులు చెబుతుంటారు. అయితే, అరిటాకులో అన్నం తినే ముందు పెద్దలు దాని చుట్టూ నీళ్లు చల్లుతారు. అలా ఎందుకు చేస్తారని ఇప్పటికీ చాలామందికి తెలీదు. ఇందుకు మంచి కారణం ఉంది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలా అరిటాకు లేదా విస్తరి చుట్టూ నీళ్లు చల్లటాన్ని చిత్రహుతి అంటారు. చిత్రహుతి అంటే దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నట్లు అర్థం. అలాగే, నేలపై కూర్చొని తినేప్పుడు దుమ్ము, ఇతర క్రిములు ఆహారంలో చేరవచ్చు. అలా జరగకుండా ఉండేందుకు విస్తరి చుట్టూ నీరు చల్లుతారట. Images Credit: Pexels