చూయింగమ్ లేదా బబుల్గమ్ నమిలే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది మంచిదేనా తెలుసుకుందాం.

షుగరీ గమ్ నమలడం వల్ల దంతక్షయం రావచ్చు. దంతాల్లో ఇన్ఫెక్షన్ రావచ్చు.

పరిమితికి మించి గమ్ నమిలే అలవాటు వల్ల టెంపోరోమాండిబ్యూలార్ జాయింట్ డిజార్డర్ అనే సమస్య రావచ్చు.

ఇందులో నిరంతరం కదలికల వల్ల దవడ కీలులో సమస్యలు వస్తాయి.

గమ్ నమిలే సమయంలో ఎక్కువ గాలి మింగేయ్యడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం వంటి జీర్ణసంబంధ సమస్యలు కూడా రావచ్చు.

ఎక్కువ సమయం పాటు నములుతూ ఉండడం వల్ల దవడ కండరాలు అలసిపోయి తలనొప్పి రావచ్చు.

కొన్ని షుగర్ ఫ్రీ గమ్స్‌లో ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను వాడుతారు. వీటితో జీర్ణసంబంధ సమస్యలు రావచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy: Pexels