వ్యాయామం ఎంత ముఖ్యమో నిద్ర కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యం.

ఈరోజుల్లో చాలా మందిని నిద్ర సమస్యలు వేధిస్తున్నాయి. చిన్న ఆహార మార్పులు మంచి నిద్రకు దోహదం చేస్తాయట.

పిస్తా పప్పులు నిద్ర పట్టేందుకు ఉపయోగపడే మెలటోనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.

చెర్రీ జ్యూస్ రెండు కప్పులు తాగితే మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి త్వరగా నిద్రలోకి జారుకోవచ్చట.

సోయా నిద్ర నాణ్యతను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. టోఫూ, మీసో వంటి సోయా ఉత్పత్తులు ఆహారంలో భాగం చేసుకోవాలి.

చమోమిలే టీ వల్ల గ్లైసిన్ విడుదలవుతుంది. చిన్నపాటి మత్తుకూడా కలిగిస్తుంది. కనుక మంచి నిద్రకు అవకాశం ఉంటుంది.

అరటి పండ్లు పోటాషియం, మెగ్నీషియం పుష్కలంగా కలిగి ఉంటాయి. వీటివల్ల కండరాలు రిలాక్సవుతాయి. మంచి నిద్ర వస్తుంది.

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, నిద్రకు ముందు ఒత్తిడులకు దూరంగా ఉంటే త్వరగా నిద్రపొయ్యే అవకాశం ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images and courtesy : Pexels