ఉదయాన్నే పాలు తాగడం ఇష్టం లేదా? పాలుకు బదులు ఈ ఐదు డ్రింక్స్ ట్రై చేయండి. బీట్రూట్ , క్యారెట్ ను కలిపి జ్యూస్ చేసి తాగితే చాలా పోషకాలు లభిస్తాయి. రోజంతా శక్తి ఇస్తుంది , క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. కొబ్బరి నీళ్ళు రోజంతా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, బరువు కూడా తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్ళు తాగితే గుండె ఆరోగ్యానికి మంచిది. మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. హెర్బల్ టీ కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ను తగ్గిస్తుంది. తులసి నీటిని తాగడం వల్ల వివిధ శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి.