డయాబెటిస్ ను సైలెంట్ కిల్లర్ అంటుంటారు. ఇప్పుడు పిల్లల్లో కూడా ఈ సంఖ్య పెరుగుతోంది.

ప్రస్తుతం డయాబెటిస్ ను పాండమిక్ గా భావిస్తున్నారు. పిల్లల్లో చాలా సర్వసాధారణంగా మారిపోతుంది.

ఎన్నో అనారోగ్యాలకు కారణం.. బరువు. పిల్లల్లోనూ నడుము చుట్టు కొవ్వు పెరిగిపోతే ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది.

తల్లి గర్భవతిగా ఉన్నపుడు డయాబెటిస్ బారిన పడితే పిల్లలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉంటే ఇన్సులిన్ నిరోధకత పెరిగే ప్రమాదం ఉంది.

ఆహారపు అలవాట్ల ప్రభావం ఆరోగ్యం మీద ఎక్కువ ఉంటుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు కలిగిన డ్రింక్స్ వల్ల పిల్లల్లో డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.

శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

రోజూ వ్యాయామం చెయ్యడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి మెరుగుపడుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels