నెంబర్ 13ను చాలామంది అపశకునంగా భావిస్తారు.

13వ నెంబర్ ఇల్లు, 13వ నెంబర్ గది, 13వ అంతస్థు.. అన్నింటినీ బ్యాడ్‌గానే భావిస్తారు.

ఈ మూఢ నమ్మకం కాథలిక్ మతం నుంచి వచ్చినట్లు సమాచారం.

‘ది లాస్ట్ సప్పర్’(చివరి విందు)లో ఏసుక్రీస్తుతో కలిపి 13 మంది కూర్చుంటారు.

ఈ 13 మందిలో జుడాస్ అనే ద్రోహి కూడా ఉన్నాడు. ఏసు క్రీస్తుకు శిలువ వేయడానికి అతడి ద్రోహమే కారణమట.

అప్పటి నుంచి 13 మంది కలిసి భోజనం చేయడాన్ని చెడు సంకేతంగా భావిస్తున్నారు.

మరి శుక్రవారంతో సంబంధం ఏమిటనేగా సందేహం? దానికి కూడా ఒక కథ ఉంది.

13 అక్టోబర్ 1307, శుక్రవారం.. నైట్స్ టెంప్లర్ సభ్యులను ఫ్రాన్స్‌లో కాల్చి చంపారు.

1940లో బంకింగ్‌హమ్ ప్యాలెస్‌పై బాంబు దాడి జరిగింది కూడా శుక్రవారం 13వ తేదీనే.

అందుకే, చాలామంది.. శుక్రవారం 13వ తేదీని హానికరంగా భావిస్తున్నారు.

Images Credit: Pixabay