పిల్లల్లో కొంతమందికి నత్తి ఎందుకు వస్తుంది?



నత్తి... చిన్న సమస్యలా కనిపిస్తుంది, కానీ ఆ సమస్యతో బాధపడే వారికే దానిలోని లోతు తెలుస్తుంది.



నత్తి సమస్య ఉన్న పిల్లల్లో కొందరికి ఒక అక్షరం పలకకపోవచ్చు, లేదా కొన్ని అక్షరాలు సరిగా రావు.



సాధారణంగా నత్తి ఎక్కువగా అబ్బాయిల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా రెండు నుంచి ఐదు ఏళ్ల వయసులో అధికంగా ఈ నత్తి వస్తుంది.



పిల్లలకు ఏడేళ్ల వయసు వచ్చేసరికి నత్తి దానంతట అదే పోతుంది. కానీ ఒక శాతం మందిలో మాత్రం పెద్దయ్యాక కూడా నత్తి వెంటాడుతూనే ఉంటుంది.



మాట్లాడడానికి అవసరమైన కండరాల మధ్య సమన్వయ లోపం తక్కువగా ఉన్నా, సమన్వయం సరిగా కుదరకపోయినా... కొన్ని అక్షరాలు సరిగా పలకలేరు. అదే నత్తి.



నత్తి జన్యుపరంగా కూడా వస్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా నత్తి రావడం సహజం.



నత్తి ఉన్నవారు జీవితంలో ఎదగలేరు అనుకోవడం మాత్రం పూర్తిగా పొరపాటే. వారిలో తెలివితేటలు పుష్కలంగా ఉండే అవకాశం ఎక్కువ.



పిల్లల్లో నత్తి అధికంగా ఉన్నప్పుడు వారికి స్పీచ్ థెరపీ ఇప్పిస్తే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది.