మీకు దెయ్యాలపై నమ్మకం ఉన్నా లేకున్నా.. దెయ్యాలను చూసినవారు ఉన్నారనేది నిజం.

ఔనండి, ఇటీవల అమెరికాలో జరిపిన సర్వేలో 75 శాతం మంది దెయ్యాలు చూశామని చెప్పారట.

చాలామందిని దెయ్యాలు వెంటాడి, వేధించాయట. అయితే, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయట.

కొందరు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. దీంతో చీకటి ప్రదేశాల్లో ఏవో ఆకారాలను చూసి భయపడుతుంటారు.

1997లో పరిశోధకులు 22 మందిని ఓ ఖాళీ థియేటర్‌లో ఉంచారట. వారిలో కొంతమందికి ఆ థియేటర్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పారట.

దెయ్యాల గురించి తెలుసుకున్నవారు.. నిజంగానే ఆ థియేటర్లో దెయ్యాలను చూశామని చెప్పారట.

అలాగే స్ట్రెస్‌తో బాధపడుతున్న కొందరు కూడా తమకు దెయ్యాలు కనిపించాయని చెప్పారట.

ఇంట్లో అతిగా చల్లగా ఉండే ప్లేస్‌లో తాము దెయ్యాలను చూశామని కొందరు చెప్పారట.

ఇష్టమైన వ్యక్తిని కోల్పోయినవారికి కూడా ఈ అనుభవం ఎదురవుతుందట. తమ ఆప్తులు ఆత్మల్లా కనిపిస్తారట.

1920లో ఓ జంట తమ ఇంట్లో దెయ్యాలను చూశామని అన్నారట. కార్బన్ మోనాక్సైడ్ లీక్ వల్లే వారికి ఆ భ్రాంతి కలిగిందట.

నిద్రలో పక్షవాతానికి గురైనవారికి కూడా దెయ్యాలను చూసిన అనుభవం ఎదురవుతుందట.

సగం నిద్ర, సగం మెలకువలో ఉన్నప్పుడు అలాంటివి కనిపిస్తాయట. వీటికి మూల కారణం మీ మెదడే.

మీ ఆలోచన, నమ్మకాలే మీకు దెయ్యాలు కనపడేలా చేస్తున్నాయట. Images Credit: Pexels and Pixabay