ఇవి తింటే మీ మెదడు చాలా షార్ప్ అవ్వడం ఖాయం



వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం తొలిగా పడేది మెదడుపైనే. విషయాలు మర్చిపోతూ ఉండడం జరుగుతుంది.



మెదడును కాపాడుకోవాలంటే కొన్ని రకాల ఆహారాన్ని ముందు నుంచే తినడం ప్రారంభించాలి.



బ్లూ బెర్రీస్, కొవ్వు పట్టిన చేపలు, ఆకుపచ్చని ఆకుకూరలు, పసుపు, నట్స్... ఇవి ప్రతిరోజూ ఈ ఆహారంలో ఉండేట్టు చూసుకోండి.



ఇవన్నీ కూడా మెదడుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి.



కొవ్వు పట్టిన చేపలు వారానికి కనీసం రెండుసార్లు తినాలి. చేపల్లోని కొవ్వుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.



పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడుకు అత్యవసరమైనది.



బాదం, అవిసె గింజలు, వాల్నట్స్, జీడిపప్పులు వంటి వాటిలో ఒమెగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.



వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజూ గుప్పెడు నట్స్ తినడం అలవాటు చేసుకోండి.