గోరింటాకు పెట్టుకుంటే ఈ లాభాలు



గోరింటాకు అందరికీ ఒకేలా పండాలని లేదు, వారి శరీర తత్వాన్ని బట్టి దాని రంగు మారుతుంది.



శరీరంలో ఎవరికైతే అధిక వేడి ఉంటుందో, వారికి గోరింట ఎర్రగా పండుతుంది.



గోరింటాకు తరచూ పెట్టుకునే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సమస్య తగ్గుతుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు.



హార్మోన్ల అసమతుల్యత ఉన్న మహిళలు గోరింటాకు తరచూ పెట్టుకుంటే అవి హార్మోన్లు చక్కగా పనిచేస్తాయని చెబుతున్నారు.



వేసవికాలంలోనే గోరింటాకును అధికంగా పెట్టుకోవాలని వివరిస్తున్నారు.



వాతావరణం చల్లగా అయ్యాక గోరింటాకు పెట్టడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు.



రసాయనాలు కలిపిన మెహెందీ మాత్రం పెట్టకూడదు. అందులో ఉండే రసాయనాలు పొరలు పొరలుగా ఊడిపోతాయి. అవి పొట్టలోకి చేరే అవకాశం ఉంది.



గోరింట ఆకులను రుబ్బి చేతికి పెట్టుకుంటేనే ఆరోగ్యం.