పీడకలలు ఎందుకు వస్తాయి?



నిద్రలో కొంతమంది భయపడిపోయి లేస్తారు. పీడకల వచ్చిందని, భయమేసిందని చెబతారు.



రాక్షసుడు వెంబడిస్తున్నట్టు, పాములు మీ వెనుక పరిగెడుతున్నట్టు, నదిలో పడిపోయినట్టు, అడవిలో ఒంటరిగా తప్పిపోయి తిరుగుతున్నట్టు ఇవన్నీ చాలా భయపెట్టే కలలు.



ఇవి నిద్రనే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి.



మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అవెందుకు వస్తాయో కచ్చితంగా చెప్పడం కష్టం.



వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉందో అందుకకు తగ్గట్టే ఈ కలలు వస్తాయని, కలలు కూడా వ్యక్తీకరణల్లో భాగమేనని అంటారు.



బాల్యంలో ఇబ్బందులకు గురి అయ్యేవారిలో యుక్త వయసు వచ్చేసరికి ఇలాంటి పీడకలలు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

80 శాతం మంది వ్యక్తులు యుక్త వయసుకు వచ్చాక కచ్చితంగా చెడు కలలను కంటారని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు.



ఈ కలలు పూర్తిగా రాకుండా అడ్డుకోవడం కష్టం.