జాక్‌ఫ్రూట్ పేరులో జాక్ అంటే ఎవరు?



పనస పండు కోసి తొనలు ఒలుస్తుంటేనే ఆ సువాసన గాలిలో నలుదిక్కులకు చేరిపోతుంది.



దీన్ని సంస్కృతంలో ‘స్కంధ ఫలం’ అంటారు. అదే ఆంగ్లంలో ‘జాక్ ఫ్రూట్’ అంటారు.



ఆ పేరు వెనుక కూడా చిన్న చరిత్ర ఉంది.



జాక్ అన్న పదం పోర్చుగీస్ పదమైన ‘జాకా’ నుంచి ఆవిర్భవించింది.



పోర్చుగీసు వారు వ్యాపార నిమిత్తం 1499లో కేరళలోని కోజికోడ్ కు వచ్చారు.



మలయాళంలో ఈ పండును ‘చక్కా’ అంటారు.



దాన్ని పలికేటప్పుడు పోర్చుగీసువారు చక్కా ను కాస్త జాకా అని పలకడం మొదలుపెట్టారు.



జాకా ఫ్రూట్‌ను కాస్త జాక్ ఫ్రూట్‌గా మార్చారు ఆంగ్లేయులు. ఆ పేరే ప్రపంచంలో స్థిరపడిపోయింది.