రవ్వతో ఇన్‌స్టెంట్ గారెలు

బొంబాయి రవ్వ - ఒక కప్పు
ఉల్లిపాయలు - ఒకటి
పెరుగు - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - చిటికెడు

కొబ్బరి తురుము - పావు కప్పు
వంట సోడా - చిటికెడు
అల్లం తరుగు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఇక స్పూను

ఒక గిన్నెలో రవ్వను నానబెట్టాలి.

బాగా నానిన తరువాత ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, పెరుగు, కొబ్బరి తురుము, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.

మిరియాల పొడి, వంట సోడా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి.

కావాలనుకుంటే కాస్త బియ్యం పిండి కాస్త కలుపుకోవచ్చు.చిక్కగా మారుతుంది.

కళాయిలో నూనె వేడెక్కాక గారెల్లా ఒత్తుకుని వేసుకోవాలి.

వేడి వేడి రవ్వ గారెలు రెడీ అయినట్టే.