రవ్వ పాయసం... ఎంతో టేస్టీ



బొంబాయి రవ్వ - నాలుగు స్పూనులు
పంచదార - నాలుగు స్పూనులు
పాలు - రెండు కప్పులు
నెయ్యి - రెండు స్పూనులు

యాలకుల పొడి - ఒక స్పూను
బాదం పప్పులు - నాలుగు
పిస్తాలు - నాలుగు
జీడిపప్పులు - నాలుగు
కిస్‌మిస్‌లు - నాలుగు

కళాయిలో ఒక స్పూను నెయ్యి వేయాలి.



అందులో బాదం పప్పులు, పిస్తాలు, జీడిపప్పులు, కిస్ మిస్‌ల తరుగును వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.



అదే కళాయిలో మరొక స్పూను నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి వేయించాలి.



అందులో పాలు, పంచదార వేసి ఉడికించాలి.



అయిదారు నిమిషాల తరువాత యాలకుల పొడి వేయాలి.



ముందుగా వేయించుకున్న నట్స్ పైన చల్లుకోవాలి.