నల్లనువ్వులతో అధిక రక్తపోటు అదుపులో

తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు... ఈ రెండూ భారతీయ వంటకాలలో ఎప్పట్నించో భాగమైపోయాయి.

ముఖ్యంగా నల్లనువ్వులు తింటే చాలా మంచిది.

నల్లనువ్వుల్లో ఉండే మెగ్నీషియ, ఫాస్పరస్ వల్ల అధికరక్తపోటును తగ్గిస్తుంది.

నువ్వుల్లో సెసమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కూడా అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది.

తద్వారా గుండె పోటు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

ఈ నువ్వుల్లో అవసరమైన మైక్రోమినరల్స్ ఉంటాయి. ఇవి కణాల పనితీరును నియంత్రించడంలో ముందుంటాయి.

నల్లనువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్పరస్, మాంగనీస్, రాగి, జింక్, ఇనుము వంటి పోషకాలతో నిండి ఉంటుంది.

గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోకులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి.