బాస్మతి బియ్యం - రెండు కప్పులు టమోటా ముక్కలు - ఒక కప్పు ఉల్లిపాయ - ఒకటి నెయ్యి - రెండు స్పూనులు కారం - ఒక స్పూను పసుపు - అర స్పూను ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు -4 స్పూన్లు నూనె - నాలుగు స్పూన్లు కరివేపాకులు - గుప్పెడు జీడిపప్పులు - ఎనిమిది అల్లం తరుగు - ఒక స్పూను వెల్లుల్లి తరుగు - ఒక స్పూను పచ్చిమిర్చి - రెండు గరం మసాలా - ఒక స్పూను
అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
కళాయిలో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.
టమాటో ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా మగ్గించాలి.
ఒక స్పూను నెయ్యి వేసి కలపాలి. ఉప్పు కూడా వేసి కలపాలి.
స్టవ్ కట్టేసి ఉడికిన అన్నాన్ని వేసి కలపాలి. ముద్దయిపోకుండా పొడిపొడిగా వచ్చేలా కలపాలి.