మొఘల్ చక్రవర్తులకు ఎండు అల్లం ఎందుకిష్టం?

ఎండు అల్లాన్ని మొఘల్ చక్రవర్తులు సౌంత్ లేదా సోంత్ అని పిలుస్తారు.

అక్బర్ చక్రవర్తి ఆగ్రాలో అల్లాన్ని అధికంగా పండించేలా చేశారు. అలాగే అక్కడి నుంచి లాహోర్‌కు కూడా రవాణా చేసేవారు.

ఇందులో ఉండే గుణాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మొఘలుల నమ్మకం. అందుకే వాటిని ఆహారంలో భాగం చేసుకునేవారు.

ఎండు అల్లాన్ని మొఘల్ చక్రవర్తులు సౌంత్ లేదా సోంత్ అని పిలుస్తారు.

ఆయుర్వేద గ్రంథం ‘చరక సంహితం’లో ‘హరిద్వర్గ’ అధ్యాయంలో ఈ సోంత్ ప్రస్తావన ఉంది.

చైనా నుండి భారతదేశానికి వచ్చిన బౌద్ధ సన్యాసి షాహియాన్ తన పుస్తకంలో దీని గురించి వివరిస్తూ చైనా, భారత దేశంలో దాని సాగు గురించి రచించాడు.

ఇప్పుడు భారతదేశం అల్లం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. అమెరికా, సౌదీ అరేబియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఆయుర్వేదంలో పొడి అల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని చాలా ఔషధాలలో ఉపయోగిస్తారు.