చపాతీ లడ్డూ చేసేయండిలా

గోధుమ పిండి - ఒక కప్పు
బెల్లం తురుము - అర కప్పు
యాలకుల పొడి - పావు స్పూను
నెయ్యి - ఐదు స్పూన్లు
ఉప్పు - ఒక పావు స్పూను
బాదం పప్పు - గుప్పెడు

ఎప్పట్లాగే చపాతీలను చేసుకోవాలి.

చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి రవ్వలాగా రుబ్బుకోవాలి.

ఆ రవ్వలో బెల్లం పొడి, కాస్త నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి.

యాలకుల పొడి కూడా వేయాలి. తరిగిన బాదంపప్పులు కూడా కలపాలి.

చేతికి కాస్త నెయ్యి రాసి చిన్న చిన్న ముద్దల్ని తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి.

అంటే టేస్టీ చపాతీ లడ్డూ రెడీ అయినట్టే.