కరివేపాకులు తాళింపు కోసమే కాదండోయ్ కరివేపాకులు తాళింపు కోసమే అనుకుంటారు చాలా మంది. తినేటప్పుడు తీసి పడేస్తారు. కరివేపాకులు ఏరిపారేసే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కరివేపాకులు రోజూ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయ సిర్రోసిస్ వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, అజీర్తి, ఎసిడిటీ వంటివి రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది. దీన్ని వల్ల గుండె సేఫ్. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి కూడా ఉంటాయి.