‘విరూపాక్ష’లో కాకులు చనిపోయినట్లే.. ఆ ఊర్లో పక్షులు చనిపోతున్నాయి. కాదు.. కాదు.. పక్షులే ఆత్మహత్య చేసుకుంటున్నాయట. ఆ గ్రామం మరెక్కడో కాదు.. ఇండియాలోనే ఉంది. అస్సాంలోని జటింగా అనే గ్రామంలో పక్షులు గుంపులు గుంపులుగా ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అమావాస్య రోజునే ఎక్కువగా ఇలాంటివి జరుగుతున్నాయట. దుష్టశక్తులు గ్రామంలోకి ప్రవేశించడం వల్లే అలా జరుగుతోందని అక్కడి వారి నమ్మకం. దీన్ని అపశకునంగా భావిస్తున్న గ్రామస్తులు ఇళ్ల ముందు వెదురు కర్రల కంచెలు పెట్టుకుంటున్నారట. అయితే, చీకటిలో పక్షులు వీధి దీపాలకు అట్రాక్ట్ అవ్వుతున్నాయనేది పరిశోధకుల వాదన. అవి లైట్ల వైపుకు వేగంగా వెళ్లే క్రమంలో స్తంభాలను, చెట్లను ఢీకొని చనిపోతున్నాయని అంటున్నారు. మరి, వేరే గ్రామాల్లో ఎందుకు ఇలా జరగడం లేదనే ప్రశ్నకు పరిశోధకుల వద్ద సమాధానం లేదు. Images and Videos Credit: Pexels and Pixabay