పిల్లలకు నిద్ర తగ్గితే ప్రమాదం చిన్న పిల్లల నుంచి చదువుకునే పిల్లల వరకు... అందరికీ నిద్ర తగినంత అవసరం. పిల్లలకు సరిపడా నిద్రలేకపోతే వారిలో మానసికంగా ఎంతో ప్రభావం పడుతుంది. పిల్లలకు పోషకాహారం ఎంత అవసరమో, తొమ్మిది గంటల నిద్ర కూడా అంతే అవసరం. స్కూలుకెళ్లే పిల్లలు కనీసం రోజులో కచ్చితంగా 9 గంటలు నిద్రపోవాలని చెబుతున్నాయి అధ్యయనాలు. నిద్ర తక్కువగా పోయే పిల్లల్లో ప్రవర్తనా లోపాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్లు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతుంటారు. ఏకాగ్రత తగ్గుతుంది. మెదడులో ఏకాగ్రతను అందించే భాగం కుచించుకుపోయే అవకాశం ఉంది. వారికి విషయాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. భావోద్వేగాలు వారి నియంత్రణలో ఉండవు.