2050 నాటికల్లా 100 కోట్ల మందికి ఈ వ్యాధి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ మందికి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. 2020లో 59 కోట్ల మంది ఆస్టియో ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు ఈ నివేదిక చెబుతోంది. అదే 1990లో కేవలం పాతిక కోట్ల మంది మాత్రమే ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇరవైఏళ్లలో అది 132 శాతం పెరిగింది. దీని ప్రకారం 2050 కల్లా 100 కోట్ల మంది ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడే అవకాశం ఉన్నట్టు చెబుతోంది ఈ కొత్త నివేదిక. వృద్ధాప్యం, ప్రపంచంలో జనాభా పెరగడం, ఊబకాయం వంటి పరిస్థితుల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పురుషులకంటే స్త్రీలపై అధికంగా దాడి చేస్తుంది. ఇలా మహిళలకు ఈ వ్యాధి ఎక్కువగా రావడానికి హార్మోన్ల కారకాలు, శరీర నిర్మాణంలో తేడాలు, వారసత్వంగా రావడం వంటివి కారణం కావచ్చు అని చెబుతున్నారు పరిశోధకులు. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది హఠాత్తుగా రాదు. కాలక్రమేణా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. వయసు పెరిగే కొద్దీ ఇది రావడం సర్వసాధారణం. అధ్యయనం ప్రకారం ఊబకాయం బారిన పడడం అడ్డుకుంటే ఆర్థరైటిస్ బారిన పడకుండా కూడా నిరోధించినట్టే.