మధుమేహం ఉన్నవారు మద్యం తాగవచ్చా?



ఎంతోమంది డయాబెటిక్ రోగులు మద్యాన్ని తాగుతూ ఉంటారు. ఇది వారి శరీరానికి చేసే హాని ఎంతో.



మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి పెట్రోల్ తోడైనట్టే. శరీరంలో ఆ రెండూ కలిసి పెట్టే మంటను ఆపడం వైద్యులకు కూడా కష్టంగానే మారుతుంది.



మధుమేహం వల్ల సాధారణంగానే నాడులు త్వరగా దెబ్బతింటాయి. ఇక మద్యం తాగితే నాడులు దెబ్బ తినే వేగం మరింతగా పెరుగుతుంది.



మధుమేహలకు మద్యం అలవాటు ఉంటే కాళ్లు, పాదాలు పుండ్లు పడడం త్వరగా జరుగుతుంది. దీనివల్ల వాటిని తొలగించాల్సి కూడా రావచ్చు.



చాలామంది మధుమేహలు మద్యం తాగాక భోజనం కూడా చేయకుండా నిద్రపోతారు. ఇది శరీరాన్ని మరింత త్వరగా క్రుశించి పోయేలా చేస్తుంది.



మద్యం తాగాక భోజనం చేయకపోవడం, మందులు వేసుకోకపోవడం అనేవి శరీరంలోని కాలేయాన్ని దెబ్బతీస్తుంది.



మద్యం తాగడం వల్ల కూడా కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇక ఆహారం తినకపోతే కాలేయం అతి త్వరగా చెడిపోతుంది.



కొన్నిసార్లు రక్తపు వాంతులు కూడా కావచ్చు. కాబట్టి మధుమేహలు పూర్తిగా మద్యాన్ని దూరం పెట్టడమే మంచిది.