భారతీయుల గృహాల్లో వెల్లుల్లి విరివిగా ఉపయోగిస్తారు. కానీ ఏదైనా అతిగా తీసుకుంటే అది అనార్థమే అవుతుంది.
వెల్లుల్లి విషయంలోనూ అదే వర్తిస్తుంది. దీన్ని అతిగా తీసుకుంటే ఎన్నో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇందులో సల్పర్ ఉంటుంది. ఇది నోరు దుర్వాసన వచ్చేలా చేస్తుంది. కానీ తాత్కాలికం మాత్రమే.
వెల్లుల్లిలో ఫ్రక్టాన్స్ అని పిలిచే ఒక రకమైన కార్బ్ ఉంటుంది. గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు కలిగిస్తుంది.
గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కి కారణమవుతుంది.
అన్నవాహికని చికాకు పెట్టె లక్షణాలు ఇందులో ఉన్నాయి.
వెల్లుల్లికి రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేసే లక్షణాలు ఉన్నాయి. రక్తం పలుచగా ఉండేవాళ్ళు, రక్తస్రావం రుగ్మతలు ఉన్న వాళ్ళు వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది.
ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాల్లో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది.
ఇది శరీర చెమట వాసన మార్చేస్తుంది. దుర్వాసన వచ్చేలా చేస్తుంది.
అందుకే మితంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. Images Credit: Pexels