ఈ మధ్య చాలామంది నిలబడి హడావిడిగా భోజనం చేస్తున్నారు. మరి, అలా తినడం మంచిదేనా? నిలబడి ఆహారం తినడం వల్ల లాభాలూ ఉన్నాయి. నష్టాలు కూడా ఉన్నాయి. నిలబడి ఆహారం తినడం వల్ల క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. బరువు తగ్గేందుకు ఇది చక్కని మార్గం. కానీ, నిలబడి ఆహారం తినడం వల్ల.. కడుపు నిండిన భావన కలగదు. దీంతో ఎక్కువ తినేస్తారు. ఒక పద్ధతిలో తినేవారికే ఇది మంచిది. నిలబడి తినడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కూడా రావు. నిలబడి తినడం వల్ల కొందరికి కడుపు ఉబ్బరం చేస్తోంది. నిపుణుల సూచన ప్రకారం.. కూర్చొని భోజనం చేయడమే ఉత్తమం. కూర్చొని తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై, శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. కూర్చొని భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే.. బరువు పెరగకుండా ఉంటారు. Images and Videos Credit: Pexels and Pixabay