చాలామందికి టీ తాగకపోతే రోజు గడవదు. టైమ్‌కు టీ పడకపోతే తలనొప్పి కూడా వస్తుంది.

కానీ, పదే పదే టీ తాగడాన్ని అలవాటుగా మార్చుంటే భవిష్యత్తులో సమస్యేనట.

మరి టీ అలవాటు విపరీతంగా ఉన్నవారు నెల రోజులు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

టీ తాగడం మానేస్తే ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయ్.

టీ మానేస్తే శరీరంలో కెఫీన్ స్థాయిలు తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఆత్రుత తగ్గుతుంది.

టీ తాగడం మానేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తగ్గుతాయి.

టీ తాగగానే కొందరికి చాలా రిలాక్స్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. సడన్‌గా మానేస్తే కొన్ని సమస్యలు వస్తాయ్.

టీ మానేయడం వల్ల వారిలో సైకలాజికల్ మార్పులు కనిపిస్తాయి. ఏదో కోల్పోయిన భావం కలుగుతుంది.

అలసట, పరధ్యానం, దృష్టి మసకబారడం, నిద్రలేమి, తలనొప్పి సమస్యలు వస్తాయ్.

కాబట్టి, అకస్మాత్తుగా కాకుండా కొద్దిగా కొద్దిగా టీ అలవాటు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Images and Videos Credit: Pexels and Pixabay