ఇప్పుడు ఎవరి చేతికి చూసినా స్మార్ట్ వాచ్ ఉంటుంది. అది పెట్టుకుంటే మీ చేతి అందం మరింత రెట్టింపు అవుతుంది. అందం ఇస్తుంది సరే మరి ఆరోగ్యం పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు చేతికి పెట్టుకునే వాచ్ ని ఎప్పుడైనా శుభ్రం చేశారా? చేయలేదు కదా.. అదే మీ పాలిట శాపం అవుతుంది. ఎందుకంటే టాయిలెట్ సీటు మీద కంటే ఎనిమిది రెట్లు బ్యాక్టీరియా మీ స్మార్ట్ వాచ్ మీద ఉంటుంది. స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ బ్యాండ్ లు హానికరమైన బ్యాక్టీరియాని కలిగి ఉంటాయి. వీటి మీద E.coli, స్టెఫిలోకాకస్‌తో ఉంటాయి. న్యుమోనియా దారి తీయవచ్చు. ప్లాస్టిక్, క్లాత్‌తో తయారు చేసిన వాచీల మీద ఇంకా ఎక్కువగా బ్యాక్టీరియా నిల్వ ఉంటుంది దద్దుర్లు వంటి చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ 85 శాతం వాచ్ బ్యాండ్‌లలో కనుగొన్నారు. యూరినరీ ట్రాక్ట్ , తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లకు దారితీసే సూడోమోనాస్‌ను 30 శాతం బ్యాండ్లలో కనుగొన్నారు. ఇకోలి బ్యాక్టీరియా.. కడుపు నొప్పి, రక్తపు విరోచనాలు, మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. అందుకే మీ స్మార్ట్ వాచ్ ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.