భూమిని కంట్రోల్ చేస్తుంది చంద్రుడే - ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? ఎట్టకేలకు చంద్రయాన్-3తో జాబిలిని అందుకున్నాం. మరి మనకు చంద్రుడి గురించి తెలియకపోతే ఎలా? చంద్రుడు.. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం. భూమికి దగ్గరగా ఉండే నేచురల్ శాటిలైట్ కూడా ఇదే. భూమి మీద నుంచి చంద్రుడి మీదకు చేరాలంటే సుమారు 27.3 రోజులు పడుతుంది. సూర్యుడు, చంద్రుడు ఒకే సైజులో కనిపిస్తారు. కానీ చంద్రుడు 400 రెట్లు చిన్నోడు. భూమి గురుత్వాకరణ శక్తిపై చంద్రుడి ప్రభావం గట్టిగానే ఉంటుంది. భూమిపై 71 శాతం నీరే కాబట్టి, చంద్రుడి శక్తి ఎక్కువగా సముద్రాలపై పడుతుంది. అందుకే, పౌర్ణమి సమయంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మన కులపోడేనట. మార్స్ పరిమాణంలో ఉన్న రాయి.. భూమిని ఢీకొట్టడం వల్ల జాబిలి ఏర్పడిందట. చంద్రుడిపై నీరు ఉందట. చంద్రుడుపై సూర్యరశ్మి తగలని ప్రాంతంలో గడ్డకట్టి ఉందని సందేహం. ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, అల్యుమినియంతో చంద్రుడు ఏర్పడ్డాడట. కానీ, అక్కడి వాయువు మనం పీల్చేందుకు అనువైనది కాదు. తప్పకుండా ఆక్సిజన్ వెంట తీసుకెళ్లాలి. Images and Videos Credit: Pexels and Pixabay