కీరదోసలో 95 శాతం నీరే ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో విటమిన్లు, సి, కె ఉన్నాయి. సలాడ్లు తినేవారికి కచ్చితంగా ఉండాల్సిన కూరగాయ ఇది. కుకుర్బిటాసిన్ బి అనేది కీరదోస ఉంటుంది. క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దోసకాయలోని సిలికా కంటెంట్ ముడతలు తగ్గిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దోసకాయలోని పొటాషియం రక్తపోటుని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలు రక్తపోటుని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. టోనర్ గా చర్మానికి మేలు చేస్తుంది. వాపు, నొప్పి, నల్లటి వలయాలను తగ్గిస్తుంది. కీరదోస తినడం వల్ల పేగు కదలికలకు తోడ్పడుతుంది. డీహైడ్రేట్ మలబద్ధకానికి ప్రధాన కారణం. Image Credit: Pexels