జుట్టు కోసమే కాదు, హెయిర్ కండీషనర్ తో చాలా పనులు చేయవచ్చు! పట్టు బట్టలను హెయిర్ కండీషనర్ వేసిన నీటిలో నానబెట్టి ఉతికితే చక్కగా మెరుస్తాయి. మేకప్ రిమూవర్ ప్యాడ్ కు హెయిర్ కండీషనర్ రాసి ముఖంపై రుద్దితే మేకప్ తొలిగిపోతుంది. హెయిర్ కండీషనర్ రాస్తే గోర్లు చుట్టూ చర్మం మృదువుగా మారుతుంది. కండీషనర్ వేసిన నీటిలో గట్టిపడిన స్వెటర్ ను నానబెడితే వదులుగా మారుతుంది. మీ వేలికి ఉంగరం గట్టిగా పట్టుకుంటే కండీషనర్ రాసి బయటకు తీయవచ్చు. జిప్పర్ గట్టిగా పట్టుకుపోతే కండీషనర్ రాసి ఈజీగా అన్‌స్టిక్ చేయవచ్చు. హెయిర్ కండీషనర్ షేవింగ్ ఫోమ్‌కు బదులుగా వాడవచ్చు. కండీషనర్ లెదర్ షూలకు చక్కగా పాలిష్ పెడుతుంది. వాషింగ్ పౌడర్ అయిపోయినప్పుడు హెయిర్ కండీషనర్ ను వాడుకోవచ్చు. కండీషనర్ తో నగలను వాష్ చేస్తే చక్కగా మెరుస్తాయి. All Photos Credit: pixabay.com