ఆ వయసులో బిడ్డల్ని కనవచ్చా?



కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల వల్ల ఆధునిక స్త్రీ పిల్లల్ని కనడం ఆలస్యం చేస్తోంది.



కొంతమంది ముప్పై అయిదేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లల్ని కనేందుకు ప్రయత్నిస్తున్నారు.



బిడ్డల్ని కనేందుకు 35 ఏళ్ల వయసు సరైనది కాదని చెబుతున్నారు వైద్యులు.



35 ఏళ్ల వయసులో గర్భం ధరించినా కూడా బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.



35 ఏళ్ల వయసు ఉన్న స్త్రీలలో అండాలు నాణ్యతగా ఉండకపోవచ్చని, గుడ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుందని వారు వివరిస్తున్నారు.



20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య అండాలు నాణ్యతను కలిగి ఉంటాయని, ఆ సమయంలోనే గర్భం ధరించడం చాలా ముఖ్యమని వివరిస్తున్నారు.



35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది.



ముప్ఫై అయిదేళ్లు దాటిన తర్వాత గర్భం ధరించినా ప్రతి మహిళా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.