మాగిన అరటిపండ్లు పడేయకండి, తింటే ఎంతో ఆరోగ్యం



అరటి పండ్లు రెండు మూడు రోజులకే నల్లగా మాగిపోతాయి. అలా వాటి తొక్క నల్లగా మారగానే తినకుండా పడేస్తారు.



మాగిన అరటిపండ్లు సాధారణ అరటిపండ్లతో పోలిస్తే ఎంతో ఆరోగ్యకరం.



ఇలాంటి మాగిన అరటిపండ్లు తినడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది.



ఇలాంటి బాగా పండిన అరటిని తినడం వల్ల ఛాతీల మంట, గ్యాస్టిక్ సమస్యలు తగ్గుతాయి.



అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెపంచుతాయి.



మాగిన అరటిపండ్లే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.



పొట్ట ఆరోగ్యానికి మగ్గిన అరటి పండ్లు మేలు చేస్తాయి.



కాబట్టి మాగిన అరటిపండ్లు బయటపడేయకుండా వాటిని తినేయడమో లేక పాన్ కేక్ వంటివి వండుకోవడమే చేయండి.