ప్రెగ్నెన్సీపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూడండి.

కవల పిల్లలు పుట్టడానికి సెక్స్ భంగిమ కూడా కారణం అంటారు. అది నిజం కాదు.

ఏ భంగిమలో సెక్స్ చేసినా పిల్లలు పుడతారు. కవలలు పుట్టడానికి ప్రత్యేక భంగిమ లేదు.

పిల్లలు పుట్టకుండా పిల్స్ వేసుకొనేవారు అకస్మాత్తుగా మానేస్తే కవలలు పుడతారనేది నిజంకాదు.

అండం విడుదలైన రెండు రోజులు ఉంటుందనేది నిజం కాదు. అది కేవలం 12 నుంచి 24 గంటలే ఉంటుంది.

కానీ, పురుషుడి వీర్యం మూడు రోజులు కంటే ఎక్కువ రోజులు యాక్టీవ్‌గా ఉంటుంది.

ఏ వయస్సులోనైనా పిల్లలు కనే సామర్థ్యం పురుషుల్లో ఉంటుందనే మరో అపోహ ఉంది.

వాస్తవానికి పురుషుల వయస్సు పెరిగే కొద్ది టెస్టోస్టెరోన్ స్థాయిలు తగ్గిపోయి.. సంతాన అవకాశాలు తగ్గిపోతాయి.

సెక్స్ తర్వాత స్త్రీలు కాళ్లు పైకెత్తితే.. వీర్యం లోపలికి వెళ్లి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందనేది నిజం కాదు.

కర్ర పెండలం తింటే కవల పిల్లలు పుడతారని అంటారు. అందులో నిజం లేదు.

వీర్యాన్ని తాగితే పిల్లలు పుడతారనేది కూడా వాస్తవం కాదు. కేవలం యోనిలోకి వెళ్తేనే సాధ్యం.

Images and Videos Credit: Pexels