తెలుగుమ్మాయి అంజలీ ‘వకీల్‌సాబ్’ తర్వాత మళ్లీ కనిపించలేదు. అంజలి ప్రస్తుతం మలయాళ చిత్రం ‘నయాట్టు’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. మరోవైపు తెలుగు వెబ్ సీరిస్ ‘ఝాన్సీ’లో, కన్నడంలో ‘బైరాగీ’ సినిమాలో నటిస్తోంది. అంజలి 2018లోనే తమిళ నటుడు జైతో ప్రేమాయణానికి పుల్‌స్టాప్ పెట్టేసింది. కెరీర్ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు సమాచారం. పెళ్లి తర్వాత సినిమాలు వద్దని జై చెప్పడం వల్లే అంజలి అలిగినట్లు తెలిసింది. అప్పటికి అంజలి చేతి నిండా సినిమాలు ఉండటంతో బ్రేకప్ చెప్పేసిందట. జైతో అంజలి కలిసి నటించిన చివరి చిత్రం ‘బెలూన్’. ప్రస్తుతం అంజలి సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇప్పట్లో పెళ్లి కబురు చెప్పేలా కనిపించడం లేదు. Images and Video Credit: Anjali/Instagram and other sources