రాత్రి త్వరగా నిద్రపోయి.. త్వరగా మేల్కొంటే ఆరోగ్యానికి మంచిది. కానీ, ఓటీటీలు, బిజీ లైఫ్ వల్ల ఎవరూ ఇప్పుడు ‘నిద్ర’ను పట్టించుకోవడం లేదు. నిద్ర తగ్గితే.. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఒక తాజా అధ్యయనం కూడా ఇటీవల అదే వెల్లడించింది. ఆలస్యంగా నిద్రపోతే ఎనర్జీ కోసం కొవ్వును కరిగించే సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి రక్తంలో కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొవ్వు వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె జబ్బులు వస్తాయి. నిద్రలేమి వల్ల టైప్-2 డయాబెటిస్ కూడా వస్తుంది. సిర్కాడియన్ రిథమ్ దెబ్బతినడం వల్ల ఇన్సులిన్ లోపాలు తలెత్తుతాయి. అమెరికాలోని రట్జర్స్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయం తెలిపారు. Images Credit: Pexels