సెల్ మెంబ్రేన్, హార్మోన్ల తయారీకీ అవసరమయ్యే కొవ్వు పదార్థం కొలెస్ట్రాల్ . తక్కువ సాంద్రత కలిగిన ఎల్డీఎల్, ఎక్కువ సాంద్రత కలిగిన హెచ్డీఎల్ రెండు రకాలుగా ఉంటుంది. హెచ్డీఎల్ ఆరోగ్యానికి అవసరమైన కొలెస్టారల్. ఎల్డీఎల్ ఆనారోగ్య హేతువు. హెచ్డీఎల్ రక్తనాళాలల నుంచి అదనపు కొవ్వు తొలగిస్తుంది. ఫలితంగా గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. హెచ్డీఎల్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చారు. కొత్త అధ్యయనాలు హెచ్డీఎల్ ఎక్కువగా ఉండడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోగా నష్టం కలుగొచ్చని చెబుతున్నాయి. రక్తంలో అదనంగా చేరిన హెచ్డీఎల్ వల్ల రక్తనాళ్లాల్లో ఇన్ఫ్లమేషన్, ఇతర గుండె సంబంధ సమస్యలు రావచ్చట. ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ స్థాయిల కోసం కేవలం మందులు మాత్రం తీసుకుంటే సరిపోదు. క్రమం తప్పని వ్యాయామం, కొవ్వులు తక్కువ కలిగిన ఆహారం తీసుకోవడం వంటి జీవన శైలి మర్పులు కూడా చేసుకోవడం అవసరం. Representational Image : Pexels and Pixabay