క్యారెట్ తో ఎముకల బలం పెరుగుతుంది. క్యారెట్ వల్ల అందే విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్ తరచుగా తీసుకునే వారిలో సిస్టోలిక్ బీపీ తగ్గుంది. క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అన్ సాచ్యూరేటెడ్ ఫ్యాట్ ఆక్సిడేషన్ నష్టాన్ని తగ్గించవచ్చు. క్యారెట్ తో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. క్యారెట్‌ను రోజూ తినొచ్చు. సుమారు సగం కప్పు ఉడికించి, పచ్చిగా లేదా బేక్ చేసి తిన్నా ఆరోగ్యమే. క్యారెట్ లో బీటా కెరోటిన్, అన్ సాల్యూబుల్ డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పోటాషియం వంటి ఖనిజ లవణాలు ఫుష్కలం. ఈ పోషకాల వల్ల జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం బావుంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు కూడా తగ్గవచ్చు. బీపి నియంత్రణలో ఉంటుంది. Representational Image : Pixels