మీరు ఎటువైపు తిరిగి పడుకుంటారు? కుడి వైపుకా? ఎడమ వైపుకా?

మీ సమాధానం ఎడమ వైపు? అయితే, డోన్ట్ వర్రీ. ఎందుకంటే...

మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ముఖ్య భాగం తోరాకిక్ డక్ట్ ఎడమ వైపే ఉంటుందట.

ఎడమ వైపునకు తిరిగి నిద్రపోతే శరీరంలోని వ్యర్థాలు, విషతుల్యాలు బయటికి పోతాయట.

లింఫ్ వ్యవస్థలో అతి పెద్ద అవయవమైన స్ల్పీన్ శరీరంలో ఎడమ వైపే ఉంటుంది.

అందుకే ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆ అవయవం చురుగ్గా ఉంటుంది. రక్త సరఫరా మెరుగవుతుంది.

గుండెల్లో మంటగా ఉన్నట్లయితే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలట.

శరీరంలో కాలేయం కుడి వైపు ఉంటుంది. కుడి వైపు తిరిగి పడుకుంటే కాలేయంపై భారం పడుతుంది.

కుడి వైపు తిరిగి పడుకుంటే కాలేయంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. అది చాలా ప్రమాదకరం.

Images and Videos Credit: Pexels