ఈ రోజుల్లో నాన్-స్టిక్ పాత్రల్లో వంటలు సర్వసాధారణమైపోయింది. ప్రమాదకరమని తెలిసీ వాడుతున్నారు. ఇప్పటికే డాక్టర్లు నాన్-స్టిక్ వినియోగం తగ్గించాలని హెచ్చరిస్తున్నా, మార్పు రావడం లేదు. నాన్ స్టిక్ పాన్‌లు వాడేకొద్ది అందులోని మైక్రోప్లాస్టిక్స్ ఆహారంలో చేరతాయి. దాని వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. సంతాన సమస్యలు కూడా వస్తాయి. ‘నాన్ స్టిక్’ పాత్రల్లో వంట క్యాన్సర్ ముప్పును కూడా పెంచుతాయట. Teflon కోటింగ్ కలిగిన నాన్ స్టిక్ పాన్స్ మరింత ప్రమాదకరం. టెఫ్లాన్ కోటింగ్ నాన్ స్టిక్ పాత్రలు విషపూరిత రసాయనాలను ఆహారంలోకి రిలీజ్ చేస్తాయట. ఒక టెఫ్లాన్ కోటెడ్ పాన్.. సుమారు 9,100 ప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ చేస్తాయట. అలాగే సిరామిక్ పాత్రలు కూడా అంత మంచివి కావట. అందులోని అల్యుమినియంతో అల్జిమర్స్ వస్తాయట. Images Credit: Pexels