కాకరకాయను ఎవరు తినకూడదంటే... కాకరకాయ తింటే ఆరోగ్యమే, కానీ ఇవి తినకూడని సందర్భాలు, తినకూడని పరిస్థితులు కూడా ఉన్నాయి. గర్భిణులు కాకరకాయలను తినకూడదు. వీటిలో ఉండే మెమోకరిన్ అనే సమ్మేళనం వల్ల అబార్షన్ కావచ్చు. అయిదు నెలల లోపు గర్భిణిలు కాకరకాయలను తినకూడదు. వీటివల్ల డయేరియా, వాంతులు, కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. మహిళలు రుతుస్రావం సమయంలో ఈ కూరగాయకు దూరంగా ఉండాలి. లేకుంటే అధికంగా రక్తస్రావం అవుతుంది. పిల్లలు పుట్టేందుకు ప్రయత్నిస్తున్న వారు, దాని కోసం మందులు వాడుతున్న దంపతులు కూడా కాకరకాయకు దూరంగా ఉండడం మంచిది. ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా రెండు వారాల పాటూ కాకరకాయకు దూరంగా ఉంటే మంచిది. రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉన్నవారు కూడా కాకరకాయకు దూరంగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా ఉన్నవారు కూడా కాకరకాయకు దూరంగా ఉండాలి.