ఆదిపురుష్‌లో హనుమంతుడి పాత్రలో మరాఠీ నటుడు దేవదత్త నాగే నటిస్తున్నారు. మహారాష్ట్రలో ఆయన ఇప్పటికే పెద్ద టీవీ స్టార్. ‘జై మల్హర్’ అనే పౌరాణిక ధారావాహికలో శివుడి పాత్రలో నటించారు. అందులో ప్రధాన పాత్రధారి కూడా ఆయనే. అనంతరం మరాఠీ, బాలీవుడ్‌లో సినిమాలు చేశారు. 2020లో వచ్చిన ‘తానాజీ’లో సూర్యాజీ మలుసరే పాత్రలో ఆకట్టుకున్నారు. దానికి కూడా ఓమ్ రౌత్‌నే డైరెక్టర్. దీంతో ‘ఆదిపురుష్’లో హనుమంతుడి లాంటి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది.