ప్రభాస్ TO కృతి సనన్- ‘ఆదిపురుష్’ స్టార్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో 2Dతో పాటు 3Dలో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో రాముడిగా నటిస్తున్న ప్రభాస్ బిటెక్ కంప్లీట్ చేశారు. లంకేషుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ లండన్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. సీతాదేవి పాత్ర పోషిస్తున్న కృతి సనన్ ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ పట్టా పొందింది. లక్ష్మణుడిగా నటిస్తున్న సన్నీ సింగ్ బిఎ(ఎకనామిక్స్) చేశారు. హనుమాన్ పాత్రధారి దేవదత్త నాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ఇంజినీరింగ్ పట్టా పొందారు.