కొణిదెల పవన్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. యాంకర్ మేఘనను త్వరలోనే పవన్ తేజ్ పెళ్లి చేసుకోనున్నాడు. యాంకర్ మేఘన స్వస్థలం కాకినాడ. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేసింది. మేఘన తండ్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతాధికారి అని సమాచారం. కాకినాడలో మేఘనా కుటుంబానికి భారీగా ఆస్తులున్నాయట. HBD - Hacked By Devil మూవీతో మేఘనా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2021లో పవన్ తేజ్‌తో ‘ఈ కథలో పాత్రలు కల్పితం’లో నటించింది. ఆ తర్వాత ఇద్దరు ‘అబ్బాయి with అమ్మాయి’ పేరుతో యూట్యూబ్ చానెల్ ఆరంభించారు. కానీ, ఆ యూట్యూబ్ చానెల్ పెద్దగా సక్సెస్ కాలేదు. నాటి పరిచయం క్రమేనా ప్రేమగా మారింది. పెళ్లి వరకు వచ్చింది. అన్నట్టు మేఘనా ‘ఈటీవీ ప్లస్’లో ‘రెచ్చిపోదాం బ్రదర్’ షోకు యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం మేఘనా ఏ షోలు చేయడం లేదు. Images Credit: Meghana/Instagram