చందూ మొండేటి దర్శకుడిగా పరిచయమైన 'కార్తికేయ' సినిమా అతడితో పాటు హీరో నిఖిల్‌కు మంచి పేరు తీసుకు వచ్చింది. ఇప్పుడు నిఖిల్, చందూ మొండేటి 'కార్తికేయ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అనుపమ హీరోయిన్. సినిమా ఎలా ఉందంటే... కథేంటి? : కార్తికేయ (నిఖిల్) ఒక డాక్టర్. అమ్మ కోరుకున్న మొక్కు తీర్చుకోవడం కోసం ద్వారకా నగరం వెళతాడు. ద్వారకలో ఆర్కియాలజిస్ట్ రావు హత్యకు గురైతే కార్తికేయను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతడిని రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) సేవ్ చేస్తుంది. కార్తికేయ, ముగ్ధ కలిసి శ్రీకృష్ణుడి కంకణం కోసం అన్వేషణ మొదలుపెడతారు. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా సినిమా. 'కార్తికేయ 2'లో హైలైట్ అంటే... శ్రీకృష్ణుని గురించి అనుపమ్ ఖేర్ చెప్పే సీన్! విజిల్స్ వేయిస్తుంది. ఒక హై ఇస్తుంది. నిఖిల్ అడ్వెంచర్ జర్నీ కూడా ఆసక్తి కలిగిస్తుంది. హీరోను సేవ్ చేసే సీన్స్‌లో అనుపమ హైలైట్ అయ్యింది. శ్రీనివాస రెడ్డి, 'వైవా' హర్ష కొన్ని సీన్స్‌లో నవ్వించారు. వాళ్ళకు ఇంకా మంచి సీన్స్ రాసుంటే బావుండేది. ఆదిత్యా మీనన్ రోల్ రెగ్యులర్ అండ్ రొటీన్ ఫార్మటులో ఉంది. అధీరాగా చేసిన వ్యక్తి ఫిజిక్ బావుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్... రెండూ సూపర్. వీఎఫ్ఎక్స్ ఓకే. శ్రీకృష్ణుని చూపించిన విధానం బావుంది. పాటల కంటే నేపథ్య సంగీతంతో కాల భైరవ ఎక్కువ ఆకట్టుకున్నారు. అఫ్ కోర్స్... పాటలు తక్కువ అనుకోండి. ఆర్ట్ వర్క్ ను కూడా మెచ్చుకుని తీరాలి. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఫస్టాఫ్ సాదాసీదా ఉంటుంది. సెకండాఫ్, క్లైమాక్స్ ఆసక్తిగా ముందుకు వెళుతూ మంచి ఫీల్ ఇచ్చాయి. 'కార్తికేయ'తో పోలిస్తే... 'కార్తికేయ 2'లో మైథలాజికల్, డ్రామా ఎక్కువ. చందూ మొండేటి కథనం ఆకట్టుకుంటుంది. హ్యాపీగా చూడవచ్చు.