పూరీ జగన్నాథ్ అండ్ టీమ్ వీర లెవల్‌లో ‘లైగర్’ను ప్రమోట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు ఉత్తరాది రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ముంబయి, పాట్నా, అహ్మదాబాద్‌లో ‘లైగర్’ టీమ్ పర్యటించింది. తాజాగా విజయ్, అనన్య పాండేలు పుణెలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. వీరిని చూసేందుకు అక్కడ పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం కావడంతో విజయ్, అనన్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ టీమ్ చండీగడ్‌లో పర్యటిస్తున్నారు. ఆగస్టు 25న ‘లైగర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ తదితర భాషల్లో విడుదలవుతోంది. ‘లైగర్’పై రౌడీ బాయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. Images & Videos Credits: Dharma Movies and Puri Connects