నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో తెలిసిందే. సురేఖ తన కూతురు సుప్రిత కలిసి చేసే రచ్చ అంతా ఇంత కాదు. నటిగా బిజీగా ఉన్న సమయంలో సురేఖ తన భర్తను కోల్పోయారు. తాజాగా సురేఖ, ఆమె కూతురు సుప్రిత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాము ప్రస్తుతానికి సింగిల్ అని తమకు బాయ్ ఫ్రెండ్ కావాలన్నారు. ఈ సందర్భంగా సురేఖ తన బాయ్‌ఫ్రెండ్‌కు ఉండాల్సిన లక్షణాలు చెప్పారు. 6 ఫీట్ హైట్, మంచి కలర్, బాగా డబ్బు, లైట్టా గడ్డం ఉండాలని సురేఖ తెలిపారు. మరి ఈ లక్షణాలు మీలో లేవేంటి సార్ అంటూ సుప్రిత ఎవరినో ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది. దీంతో సురేఖావాణి త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది. సుప్రితా కూడా సురేఖకు పెళ్లి చేసేస్తే తన బుర్ర తినడం మానేస్తుందని అంటోంది. Images and Videos Credit: Surekhavani/Instagram