రోజూ వెన్నె తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా? వెన్న ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో విటమిన్లు A, D, E, K2 ఉంటాయి. బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు కూడా ఉంటాయి. బ్యుటిరేట్ పోషకం జీర్ణక్రియను మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్, పెద్ద పేగులో క్యాన్సర్ కారకాలను నివారిస్తుంది. వెన్నలోని సీఎల్‌ఏ గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యన్ని పెంచుతుంది. వెన్నలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా 3, ఒమెగా6 ఫ్యాటీ ఆమ్లాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పలు క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఉపయోగపడుతాయి. రోజుకు 25 గ్రాముల వెన్న తీసుకోవడం వల్ల జ్ఞాకపక శక్తి మరింత పెరుగుతుంది. All Photos Credit: Pixabay.com