ఏ రోజు ఏ రంగు డ్రెస్ వేసుకుంటే అదృష్టం కలిసొస్తుందంటే!



వారానికి ఏడురోజులు. ఆయా రోజులకు ఆయా దేవతలు అధిపతులుగా ఉంటారు. గ్రహాలు కూడా అధిపతులు ఉంటారు. ఆయా దేవతలకు, గ్రహాలకు అనుకూలమైన రంగులు ధరిస్తే అనుకూల ఫలితాలొస్తాయంటారు పండితులు



సోమవారం తెలుపు లేదా నీలిరంగు దుస్తులు ధరిస్తే మంచిది



మంగళవారానికి కుజుడు అధిపతి అందుకే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి



బుధగ్రహానికి సంబంధించిన బుధవారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి



శ్రీ మహా విష్ణువును పూజించే గురువారం రోజున పసుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించాలి



శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడికి తెలుగు రంగు అంటే ఇష్టం. అందుకే తెలుగు రంగు వస్త్రాలు వేసుకోవాలి



శనివారం శనిదేవుడి ప్రీతికరమైన రోజు. ఈ రోజు నలుపు రంగు దుస్తులు ధరించాలని కొందరు, పర్పుల్ కలర్ దుస్తులు ధరించాలని మరికొందరు చెబుతారు. కొందరు శనివారం రోజు నలుపు అస్సలు వేసుకోరాదని కూడా చెబుతారు.



ఆదివారం సూర్యుడికి అంకితం. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించే ఆరోగ్యం అంటారు.



ఆయా రోజుల్లో ఆయా రంగుల దుస్తులు ధరిస్తే కంటికి, వంటికి మంచిదని పెద్దల అభిప్రాయం. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
(images credit: Pinterest)